పెద్ద కొడప్ గల్ తహశీల్దార్ కార్యాలయాన్ని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సందర్శించారు. భూభారతిలో కార్యక్రమంలో రెవెన్యూ సదస్సులో రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
రెవెన్యూ అధికారులతో పలు సమస్యలపై చర్చించారు. రెవెన్యూ సదస్సులలో 499 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారని అందులో 152 మంది రైతులకు నోటీసులు అందజేశామన్నారు. మిగిలిన దరఖాస్తులలో ఎక్కువ శాతం అటవీ శాఖకు చెందినవేనని చెప్పారు. మండల వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఏ దశలో ఉన్నాయాని అధికారులను అడిగి తెలుసుకున్నారు. తహశీల్దార్ దశరథ్, నాయబ్ తహశీల్దార్ రవికాంత్, ఆర్ఐ అంజన్న, సిబ్బంది తదితరులు ఉన్నారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.