తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం (జూన్ 2) సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు
శాంతియుతంగా పార్లమెంటరీ పంథాలో కొట్లాడి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఆగమైన తెలంగాణను స్వయం పాలనలో అభివృద్ధి చేసుకున్నామని కేసీఆర్ తెలిపారు
సకల జనుల సంక్షేమాన్ని కొనసాగిస్తూ, సమస్త రంగాల్లో ప్రగతిని సాధిస్తూ, పదేండ్ల అనతికాలంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలుపుకున్నామని కేసీఆర్ వివరించారు
అదే స్పూర్థిని కొనసాగిస్తూ, అన్ని వర్గాల ప్రజల జీవన విధానం మరింత గుణాత్మకంగా సాగే దిశగా పాలనా ప్రాధాన్యతలను ఎంచుకొని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ సూచించారు.
ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల్లో విశ్వాసం నింపాలని స్పష్టం చేశారు.
తెలంగాణ మరింత ప్రగతిని సాధిస్తూ, పాడి పంటలతో వర్థిల్లుతూ, రైతులు సబ్బండ కులాలు, సకలజనుల జీవితాలు సుఖ సంతోషాలతో నిండాలని కేసీఆర్ ఆకాంక్షించారు.