ఇది ప్రజా ప్రభుత్వం : ఎమ్మెల్యే
ఇది ప్రజా ప్రభుత్వమని ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. డోంగ్లి తహసీల్దార్ కార్యాలయంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమానికి పెద్ద పీఠ వేస్తున్నారని గుర్తు చేశారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా…
జుక్కల్ లో రేషన్ కార్డులను పంపిణీ చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే
జుక్కల్ మండల కేంద్రంలోని లక్ష్మి ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు అధ్యక్షతన నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వన్ హాజరయ్యారు. కలెక్టర్ ఎమ్మెల్యే చేతుల మీదుగా 925 నూతన రేషన్ కార్డులను…
విధుల్లో నిర్లక్ష్యం వహించిన జుక్కల్ ఆసుపత్రి సూపరింటిండెంట్, డ్యూటీ డాక్టర్ కు షోకాష్ నోటీస్:కలెక్టర్
విధులలో నిర్లక్ష్యం వహించిన జుక్కల్ సామాజిక ఆసుపత్రి సూపరింటిండెంట్, డ్యూటీ డాక్టర్ కు షోకాష్ నోటీస్ ఇవ్వాలని డిసిహెచ్ఎస్ ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా జుక్కల్ మండల కేంద్రంలోని సామాజిక ఆస్పత్రిని…
సమాజ సేవలో ముందుండాలి: ఎమ్మెల్యే
సమాజ సేవలో ప్రతి ఒక్కరు ముందుండాలని ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. డోంగ్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు షూ పంపిణీ చేశారు. పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులందరికీ గ్రామానికి చెందిన శివరాజ్ పటేల్ షూ పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు. ప్రభుత్వ…
నిజాంసాగర్: మాగి శివాలయంలో భక్తుల పూజలు
నిజాంసాగర్ మండలం మాగి గ్రామంలోని శివాలయంలో శ్రావణమాసం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సందడితో ఆలయం ఆధ్యాత్మికంగా వాతావరణం నెలకొంది. భక్తులు కోరుకున్న కోరికలు నెరవేర్చే శివాలయంగా పేరుందని ఆలయ పూజారి తెలిపారు.
జుక్కల్ శివాలయంలో భక్తుల పూజలు
జుక్కల్ మండల కేంద్రంలోని లిజలింగేశ్వరస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసం రెండవ సోమవారం సందర్భంగా అభిషేకం చేసి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం నుంచే ఆలయానికి భక్తులు బారులు తీరారు వచ్చిన భక్తులకు ఆలయ పూజారి విశ్వనాథ్ ప్రసాద…
కౌలాస్ నాల ప్రాజెక్టు అందాలు
జుక్కల్ మండలం కౌలాస్ నాల ప్రాజెక్టు అందాలు చూపరులను కనువిందు చేస్తునాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాజెక్ట్ నిండి, చుట్టుపక్కల వాతావరణం పచ్చదనంతో కళకళలాడుతుంది. ఇటీవల ఓ యువకుడు ప్రాజెక్టుతో పాటు పరిసర ప్రాంతాలను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించాడు. ప్రస్తుతం ఆ…
కేంద్ర ప్రభుత్వ పనుల పరిశీలన
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పనుల వివరాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మద్నూర్ డోంగ్లి మండలాలలో మేనూర్, ధోతి, ఏలేగావ్ గ్రామ పంచాయతీలలో NLM (నేషనల్ లెవెల్ మానిటరింగ్ ) బృందం అధికారులు పర్యటించారు. ఉపాధి హామీ పంచాయతీరాజ్ ఐకెపి…
హసన్ టాక్లి లో తల్లిపాల వారోత్సవాలు
డోంగ్లి మండలం హసన్ టాకీ లో అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతను అంగన్వాడి టీచర్ సచిత వివరించారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రం ద్వారా బాలింతలు, గర్భిణీలు, చిన్నపిల్లలకు అందించే పౌష్టికాహారం వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో…
పిట్లంలో కంటి వైద్య శిబిరం
పిట్లం ప్రభుత్వ ఆసుపత్రిలో కంటి వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా ఆంధత్వ సంస్థ, లయన్స్ క్లబ్ ఆఫ్ పిట్లం ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు ఆప్థాలమిక్ ఆఫీసర్ హరికిషన్ రావు సార్ తెలిపారు. వైద్య శిబిరానికి వచ్చిన 58…