నిజాంసాగర్ గేట్ల ఎత్తివేత
భారీ వర్షాలతో నిజాంసాగర్, కౌలాస్ నాల ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఎగువ నుంచి భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి 75,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు…
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు: గేట్లు ఎత్తి అవకాశం
నిజాంసాగర్ జలాశయం (ప్రాజెక్టు)లోకి ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. 50వేల క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో ప్రాజెక్టులోకి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో అధికారులు మంజీర పరీవాహక ప్రాంతంలో ఉండే ప్రజలను అప్రమత్తం…
వినాయక చవితి శాంతియుతంగా జరుపుకోవాలి
వినాయక చవితి పండగ, నిమజ్జన కార్యక్రమం శాంతియుతంగా జరుపుకోవాలని మద్నూర్ ఎస్.ఐ విజయ్ కొండ అన్నారు. మద్నూర్ రైతు వేదికలో వినాయక చవితి పండగ నిమజ్జన కార్యక్రమంపై మద్నూర్- డోంగ్లి రెండు మండలాల వినాయక మండపాల నిర్వాహకులతో శాంతి కమిటీ సమావేశం…
చిన్న ఎక్లార గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
మద్నూర్ మండలం చిన్న ఎక్లార గ్రామాన్ని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సందర్శించారు. భారీ వర్షానికి గ్రామంలోకి వరద నీరు చేరడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే స్పందించారు. గ్రామానికి చేరుకొని ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. చెక్…
అంతపూర్-సోమూర్ వాగును పరిశీలించిన సబ్ కలెక్టర్, అధికారులు
మద్నూర్ మండలం సోమూర్- అంతపూర్ మార్గంలో ఉన్న వాగును బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మండల స్థాయి అధికారులతో కలిసి పరిశీలించారు. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహించి రోడ్డు కొట్టుకుపోయినట్లు గుర్తించారు. రోడ్డుకు మరమ్మతులు చేసేంత వరకు…
చిన్న ఎక్లార గ్రామాన్ని సందర్శించిన సబ్ కలెక్టర్
మద్నూర్ మండలం చిన్న ఎక్లార గ్రామాన్ని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సందర్శించారు. గ్రామంలోకి వరద నీరు రావడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని సమాచారం తెలుసుకున్న సబ్ కలెక్టర్ వెంటనే మండల స్థాయి అధికారులతో కలిసి గ్రామానికి వెళ్లారు. కాలువలో చెత్తతో…
లేండి వాగును పరిశీలించిన అధికారులు
మద్నూర్ మండలం గోజేగావ్ గ్రామ సమీపంలో ఉన్న లెండి వాగును రెవెన్యూ, పోలీస్ అధికారులు పరిశీలించారు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షానికి ఉధృతంగా ప్రవహిస్తున్న అన్న సమాచారం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన వాగు వద్దకు వచ్చారు. నీటి ప్రవాహం తగ్గడంతో రాకపోకలకు…
చిన్న ఎక్లార గ్రామంలోకి చేరిన వరద నీరు: ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు
భారీ వర్షానికి వాగులు పొంగిపొర్లడంతో పాటు పలు గ్రామాలకులోకి నీళ్లు రావడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. మద్నూర్ మండలం చిన్న ఎక్లార గ్రామంలో ఉన్న వాగుకు భారీగా వరద నీరు రావడంతో గ్రామంలోకి నీళ్లు వచ్చాయి. ఆలయం, తాగునీటి ట్యాంక్ సమీపంలో…
పొంగిపొర్లుతున్న వాగు-నిలిచిన రాకపోకలు
రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు పొంగిపొర్లుతున్నాయి. మద్నూర్ మండలం అంతాపూర్- సోముర్ మార్గంలో ప్రధాన రహదారిపై ఉన్న వాగు పొంగిపొర్లుతుంది. దీంతో రెండు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. మద్నూర్- జుక్కల్ రెండు మండలాల ప్రజలు ఈ మార్గంలో…
మద్నూర్ తాసిల్దార్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ
మద్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తహసిల్దార్ ముజిబ్ జాతీయ జెండాను ఎగురవేశారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు ఉన్నారు.