అంగన్వాడి కేంద్రంలో ఈసీసీ డే

డోంగ్లి మండలం హసన్ టాక్లి గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో ఈసీసీ డే నిర్వహించినట్లు అంగన్వాడీ టీచర్ సచిత తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు అట్టలతో పాటు మట్టి బొమ్మలతో డ్రైవింగ్, పిల్లలను ఉత్సాహంగా… ఉల్లాసంగా ఉండేలా చేశామన్నారు. పౌష్టికాహారంపై…

భూ సమస్యల పరిష్కారం కోసమే భూభారతి

భూ సమస్యల పరిష్కారం కోసమే భూభారతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని తహశీల్దార్ ముజీబ్ అన్నారు. మద్నూర్ మండలం సోనాల, గోజెగావ్‌ గ్రామాల్లో భూ భారతి భూ హక్కుల చట్టంపై ఆయా గ్రామాల వాసులకు వివరించారు భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. గోజేగావ్…

మంత్రి సీతక్కను కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే

మంత్రి సీతక్కను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కలిశారు. ఈ రోజు కొత్తగా నియమితులైన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ మంత్రి ధన్సరి అనసూయ (సీతక్క)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు కొత్త ఇన్‌చార్జ్…

రెండు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు

మద్నూర్ మండలంలో రెండు గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్లు తహశీల్దార్ ముజీబ్ తెలిపారు. చిన్న తడ్గుర్ గ్రామంలో 13 దరఖాస్తులు, ఖరగ్ గ్రామంలో రెండు దరఖాస్తులు వచ్చాయి అన్నారు. భూ భారతి, భూమి హక్కుల రికార్డు తదితర సమస్యలను పరిష్కరిస్తామని ఆయన…

పశువులకు వ్యాధి నిరోధక టీకాలు

వర్షాకాలంలో పశువులలో సాధారణంగా వ్యాపించే గొంతువాపు, జబ్బవాపు వ్యాదుల నిర్మూలనలో భాగంగా పిట్లం మండలంలో పలు గ్రామాలలో పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేసినట్లు వైద్యులు తెలిపారు. మర్దండ గ్రామములో 56 గేదెలకు ఈ టీకాలు వేసి రైతులకు వాటి ప్రముఖ్యతను…

పిట్లంలో ట్యాంకర్ ద్వారా తాగునీటి సరఫరా

పిట్లంలో మిషన్ భగీరథ నీళ్లు సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో ఎస్సీ కాలనిలో స్థానికులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా గ్రామ పంచాయతీ ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేసినట్లు గ్రామపంచాయతీ కార్యదర్శి బలరాం తెలిపారు.

రైతు నేస్తం కార్యక్రమం

మద్నూర్ రైతు వేదికలో సోమవారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 2025 వానకాలం సీజన్ రైతు భరోసా పథకం ప్రారంభోత్సవం ఉందని మండల వ్యవసాయ అధికారి రాజు తెలిపారు. కొత్తగా రైతు వేదికకి కేటాయించిన…

మహారాష్ట్ర దేశిదారు పట్టివేత

మద్నూర్ మండలం రుషేగావ్ చౌరాస్తా జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీలు చేస్తుండగా ద్విచక్ర వాహనంపై మహారాష్ట్ర పది దేశిదారు సీసాలను తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్నట్లు బిచ్కుంద ఆబ్కారీ సీఐ సత్యనారాయణ తెలిపారు. సురేష్, దిగంబర్, భాస్కర్ అక్రమంగా దేశదారులు తరలిస్తున్న ముగ్గురు…

పెద్ద తడ్గుర్ గ్రామంలో రెవెన్యూ సదస్సు

మద్నూర్ మండలం పెద్ద తడ్గుర్ గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించినట్లు తహశీల్దార్ ముజిబ్ తెలిపారు. పలువురు అందించిన దరఖాస్తులు తీసుకున్నామన్నారు.

అంతాపూర్ లో రెవెన్యూ సదస్సు

మద్నూర్ మండలం అంతపూర్ గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. భూములు, ఇతర రెవెన్యూ పరమైన సమస్యలపై స్థానికులు అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహశీల్దార్ శివరామకృష్ణ, ఆర్.ఐ శంకర్, జూనియర్ అసిస్టెంట్ రవి పాల్గొన్నారు.