బంగారు పల్లి లో వైద్య శిబిరం

జుక్కల్ మండలం బంగారు పల్లి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నారని సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు వెంటనే స్పందించి వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఫోన్లో విషయాన్ని చెప్పారు. వెంటనే ప్రత్యేక వైద్య బృందాన్ని…

జుక్కల్ బస్టాండ్ లో బురదలో ఇరుక్కున్న బస్సు

జుక్కల్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఓ ఆర్టీసీ బస్సు బురదలు కూరుకుపోయింది. దీంతో డ్రైవర్ ఎంత సేపు బస్సు ను బయటకు తీసే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. జేసీబీని తీసుకువచ్చి బస్సు వెనుక భాగం నుంచి తోయడంతో…

ఆదర్శ పాఠశాలలో అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

మద్నూర్ మండలం మేనూర్ ఆదర్శ పాఠశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ నర్సా గౌడ్ తెలిపారు. తెలుగు, పొలిటికల్ సైన్స్ బోధించుటకు అర్హులైన ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో పీజీ,…

బంగారు పల్లిలో శరవేగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు

జుక్కల్ మండలం బంగారు పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయని మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ తెలిపారు. గ్రామంలో ఆరుగురు లబ్ధిదారులకు మంజూరైన ఇల్లు ప్రస్తుతం స్లాబ్ వేసినట్లు ఆయన తెలిపారు. స్లాబ్ పూర్తయిన సందర్భంగా లబ్ధిదారులకు…

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు త్వరగా ప్రారంభించాలి

ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరగా పనులు ప్రారంభించాలని మండల ప్రత్యేక అధికారి కిషన్ అన్నారు. పెద్ద కొడప్ గల్ మండలము వడ్లం, కాస్లాబాద్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులతో మండల ప్రత్యేక అధికారి కిషన్ అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు.…

అంగన్వాడి పిల్లలకు పలకలు పంపిణీ

పిట్లం మండలం నాగంపల్లి తండా అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పలకలు పంపిణీ చేశారు. లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలకలు పంపిణీ చేసినట్లు అంగన్వాడీ టీచర్ తెలిపారు. మండలంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు లైన్స్ క్లబ్ ప్రతినిధులు చెప్పారు.

పాఠశాలను సందర్శించిన ఎంఈఓ

పిట్లం మండలంలోని పలు గ్రామాల ప్రభుత్వ పాఠశాలలను మండల విద్యాధికారి దేవి సింగ్ పరిశీలించారు. మద్దెల చెరువు ప్రాథమికోన్నత పాఠశాలతో పాటు బండాపల్లి ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో నమోదు అయిన పిల్లల సంఖ్య , హాజరు, టీచర్ల హాజరు పరిశీలించారు.…

మద్నూర్ లో డాక్టర్స్ డే

డాక్టర్స్ డే సందర్భంగా మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులకు సిబ్బంది, గ్రామస్తులు సన్మానం చేశారు. డాక్టర్ సునీల్ థడ్కేను సిబ్బంది ఘనంగా సన్మానించారు. సమాజంలో వైద్యుల పాత్ర కీలకమైనదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నర్సులు శిల్పా మయురి, లలిత, కంపౌండర్ ఖలీమ్,…

ప్రజావాణిలో సమస్యల పరిష్కారం

ప్రజావాణిలో దరఖాస్తులు చేసిన వారికి వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామనితహశీల్దార్ ముజిబ్ అన్నారు. తహశీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయా గ్రామాల వాసుల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. ఆయనతో పాటు మండల అభివృద్ధి అధికారిని రాణీ…

కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

డోంగ్లి మండలం ఇలెగాం గ్రామంలో లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అందజేశారు. ప్రభుత్వం నిరుపేదలకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను ప్రజలందరికీ తెలియజేయాలని కార్యకర్తలకు సూచించారు.