వర్షాకాలంలో సాగు చేసిన పంటల కోసం నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేశారు. మంగళవారం సాయంత్రం
ప్రాజెక్ట్ నుంచి 1,200 వందల క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువ ద్వారా విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ ఏఈఈలు సాకేత్, శివప్రసాద్ తెలిపారు. ప్రాజెక్టు జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం సమీపంలోని ప్రధాన గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. పది రోజుల పాటు నీటి విడుదల కొనసాగుతుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రాజెక్టులో ప్రస్తుతం పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులకు (17.80 టీఎంసీలు) గాను 1,391.46 అడుగులు (4.703 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. ఆయకట్టు రైతుల అవసరాలకు అనుగుణంగా నీటి విడుదలలో హెచ్చుతగ్గులు ఉంటాయని అధికారులు అన్నారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.