నిజాంసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ నుంచి భారీగా వరద వస్తుంది. ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో జలాశయం 15 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మంజీర నది పరవళ్లు తొక్కుతోంది. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో మంజీర నదికి భారీగా వరద వస్తోంది. సింగూరు ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో వస్తుండడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ భద్రత దృష్ట్యా ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నింపొద్దని ఎన్డీఎస్ఏ అధికారులు సూచించారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 29 టీంఎసీలు ఉండగా, 22 టీఎంసీలు నీరు మాత్రమే నిల్వ ఉంచుతున్నారు. మిగతా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్‌లోకి సింగూరు, పోచారం ప్రాజెక్ట్‌ల నుంచి 83 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405 (17.80 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం 143.61 (15.81 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో 15 గేట్ల ద్వారా 85 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.