నిజాంసాగర్ జలాశయం (ప్రాజెక్టు)లోకి ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. 50వేల క్యూసెక్కులకు పైగా ఇన్​ఫ్లో ప్రాజెక్టులోకి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో అధికారులు మంజీర పరీవాహక ప్రాంతంలో ఉండే ప్రజలను అప్రమత్తం (అలర్ట్) చేశారు. ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాబోయే 24 గంటల్లో నిజాంసాగర్​ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని. ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశాలు ఉన్నాయని తహశీల్దార్​ భిక్షపతి, నీటిపారుదల శాఖ ఏఈలు అక్షయ్ కుమార్, సాకేత్​లు తెలిపారు. జాలర్లు, గొర్రెల కాపర్లకు (అలర్ట్​) అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నందున మంజీర పరీవాహక ప్రాంతంలో చేపలు పట్టేవాళ్లు, గొర్రెల కాపర్లు అలర్ట్​గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నీటి ఉధృతి ఉంటుందని, పరీవాహక ప్రాంతాలవైపు వెళ్లవద్దని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 17.8 టీఎంసీలకు గాను 10.79 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. సింగూరుకు భారీగా వరద నీరు వస్తుండడంతో నిజాంసాగర్​ నీటిమట్టం వేగంగా పెరుగుతోంది.

Srinivas Goud Journalist

Journalist CEO OF MANA JUKKAL NEWS. Gmail: manajukkal49@gmail.com


Discover more from MANA JUKKAL

Subscribe to get the latest posts sent to your email.

By Srinivas Goud Journalist

Journalist CEO OF MANA JUKKAL NEWS. Gmail: manajukkal49@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *