భారత ఎన్నికల ప్రక్రియలో బూత్ లెవెల్ అధికారులే కీలకమని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల బి.చందర్ అన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బూత్ లెవల్ అధికారులకు నిర్వహిస్తున్న ట్రైనింగ్ (శిక్షణ) కార్యక్రమం నిర్వహించారు. మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మద్నూర్, డోంగ్లి మండలాల బూతు లెవల్ అధికారులకు ఎన్నికల నిర్వహణలో వారి పాత్ర, ఓటరు జాబితా రూపకల్పనలో వారి పాత్ర , ఇంటింటి సర్వే, ఫారం 6, 7, 8 లను ఏ విధంగా చేయాలి, దాంట్లో వస్తున్నటువంటి సమస్యలు , పరిష్కారాలపై టీవీ ద్వారా BLO లకు ట్రైనింగ్ ఇచ్చారు. ఎన్నికల సంగ్రామంలో ఓటర్ జాబితా తయారీలో BLO లే కీలకం అన్నారు. BLO లేనిదే ఎన్నికలు, ఎన్నికల సంఘం లేదు.. అలాంటి గొప్ప పాత్ర BLO లది కావున ఓటర్ జాబితాను తప్పుడు లేకుండా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం.డి ముజీబ్, నాయబ్ తహసిల్దార్ శివరామకృష్ణ, గిర్దవార్ లు శంకర్, సాయిబాబా, రవి, బాలరాజు, దశరథ్, ప్రవీణ్ మరియు రెండు మండలాల BLO లు పాల్గొన్నారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.