మద్నూర్ విద్యాశాఖలో మండల విద్యాధికారి వింత పోకడలతో ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకపక్ష నిర్ణయాలతో మండల విద్యాశాఖ గందరగోళంగా మారిన ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విసుగు చెందిన పలువురు ఉపాధ్యాయులు ఆయనపై చర్యలు తీసుకోవాలని మండల, జిల్లా అధికారులకు పత్రాలు అందజేశారు. జిల్లా స్థాయిలో వర్క్ అడ్జస్ట్మెంట్ లో భాగంగా టీచర్లను సర్దుబాటు చేసే ప్రక్రియ ప్రొసీడింగ్స్ జిల్లా విద్యాధికారి గురువారం విడుదల చేశారు. మండల విద్యాధికారులు ఎక్కడ టీచర్లను సర్దుబాటు చేయాలో సంఖ్య ఆధారంగా ఖాళీ ఉన్న పోస్టుల ఆధారంగా సర్దుబాటు లిస్టు తయారుచేసి జిల్లా విద్యాధికారికి పంపించాలి. తరువాత జిల్లా విద్యాధికారి ఆయా టీచర్లను సర్దుబాటు చేస్తున్నట్లు ప్రోసిడింగ్ ఇస్తారు. మద్నూరు మండలంలో విద్యాధికారిగా పనిచేస్తున్న రాములు వింత నిర్ణయాలు, ఏకపక్ష నిర్ణయాలతో సర్దుబాటు ప్రక్రియ సంఖ్యను ప్రామాణికంగా పాటించక లిస్టులు తయారు చేశారు. మరాఠీ మీడియంకు చెందిన టీచర్ ను తెలుగు మీడియం, గర్ల్స్ ప్రైమరీ కి కేటాయించారు. సంఖ్య ఎక్కువగా ఉన్న చోట ఎక్కువ మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వారిని సర్దుబాటు చేయలేదు. సలాబత్ పూర్ పాఠశాలలో పని చేస్తున్న ఓ ఉపాధ్యాయున్ని అదే సలాబత్ పూర్ పాఠశాలకు పంపడం విడ్డూరం ఉందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. డోంగ్లి మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయున్ని పెద్ద శక్కర్గ. పాఠశాలకు, అదే పెద్ద శక్కర్గ పాఠశాలకు చెందిన మరో ఉపాధ్యాయున్ని సోనాలకు సర్దుబాటు చేశారు. సోనాలలో విద్యార్థుల సంఖ్యకు ఒక ఉపాధ్యాయుడు పని చేయాలి. కానీ ఇద్దరిని సర్దుబాటు చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉర్దూ మీడియం మద్నూరులో సబ్జెక్టు ఒక టీచర్ ఉండాలన్న నిబంధన ఉన్న తెలుగు, సోషల్ సబ్జెక్టు లకు అడ్జస్ట్ మెంట్ లో ఎవరికీ కేటాయించలేదు. ఇలా ఇష్టారీతీగా వ్యవహరించిన మండల విద్యాధికారి పై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు పిర్యాదు చేయనున్నట్లు తపస్ నాయకులు తెలిపారు. స్థానిక మండల విద్యా వనరుల కేంద్రంలో సర్దుబాటు ప్రక్రియలో న్యాయం పాటించాలని అవసరం ఉన్నచోట ఉపాధ్యాయులను కేటాయించాలని యం ఐ ఎస్ కో ఆర్డినేటర్ రవి కాంత్ కు వినతి పత్రం అందించారు. అదేవిధంగా తపస్ జిల్లా నాయకులు రచ్చ శివకాంత్ మాట్లాడుతూ పాఠశాలల సమస్యలను పట్టించుకోని మండల విద్యాధికారి పై త్వరలో పై అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా నాయకులు రచ్చ శివకాంత్, జిల్లా కార్యదర్శి గోజె సంజీవ్, మండల అధ్యక్షులు పండరినాథ్, జనరల్ సెక్రెటరీ అజిత్ పవార్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.