అర్థశాస్త్ర విభాగంలో పి.హెచ్.డి పట్టా పొందిన ఇద్దరు అభ్యర్థులకు మద్నూర్ లో ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. మద్నూర్ మండలం ధనూర్ గ్రామానికి చెందిన డాక్టర్ సత్పాల్ దేవదాస్, అంతా పూర్ గ్రామానికి చెందిన డాక్టర్ దానేవార్ గంగాధర్ లు అర్థశాస్త్ర విభాగంలో పి.హెచ్.డి పట్టా పొందారు. తపస్ మద్నూర్ మండల శాఖ ఆధ్వర్యంలో మద్నూర్ ఉర్దూ హైస్కూల్ లో వారికి ఘనంగా సన్మానించారు. డాక్టరెట్ పొందిన ఇద్దరు మద్నూర్ మండలానికి చెందిన వారు కావడం అభినందనీయమన్నారు. తపస్ మండల అధ్యక్షులు పండర్నాథ్, జనరల్ సెక్రెటరీ అజిత్ పవర్ మాట్లాడుతూ చిన్న గ్రామం నుండి ఉన్నత విద్య కై వెళ్లి ఉన్నత చదువులు చదివి అర్థశాస్త్ర విభాగంలో పి.హెచ్.డి పట్టా పొందడం మద్నూరు మండల కేంద్రానికి గర్వకారణమని తెలిపారు. తపస్ జిల్లా నాయకులు రచ్చ శివకాంత్ మాట్లాడుతూ పేదరికానికి విద్య అడ్డు రాదని, మారుమూల గ్రామాల నుండి ఉన్నత విద్యావంతులు కావడం సంతోషకరంగా ఉందని, వీరు డాక్టరేట్ సాధించడం మద్నూర్ కు మంచి పేరు వచ్చింది అన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ఒక గమ్యాన్ని ఏర్పాటు చేసుకొని విజయ తీరాలకు చేరాలన్నారు. అనంతరం డాక్టరేట్ సాదించిన విద్యార్థులు మాట్లాడుతూ..ఇద్దరం నిరుపేద కార్మిక కుటుంబాలలో జన్మించి. ..ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని..కష్టపడుతూ…ఇష్టపడుతూ…అనుకున్నది సాదించామన్నారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు నాంపల్లి మల్లేశం, టీచర్స్ షాహిని బేగం, షాహిని ఫాతిమా, నవిద్ నస్రీన్ తపస్ నాయకులు గోజే సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.