మద్నూర్ పాత బస్టాండ్ లో ఉన్న ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణానికి దాతలు ముందుకు రావాలని ఆలయ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయానికి మరమ్మత్తులు చేసి పునర్నిర్మించేందుకు ఆలయ కమిటీ సభ్యులు ముందుకు వచ్చారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాలని వారు కోరారు. గ్రామంలో ప్రతి ఏటా ఎడ్ల పొలాల అమావాస్య రోజు ఈ ఆలయం చుట్టూ గ్రామస్తులు ఎడ్లను, రథం ను సైతం తిప్పుతారని వారు గుర్తు చేశారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.