మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మండిపడ్డారు. కాలేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం సిబిఐ విచారణకు వెళ్లడంపై బీఆర్ఎస్ పార్టీ అద్వర్యం నిరసన వ్యక్తం చేశారు. మద్నూర్ మండల కేంద్రంలో మద్నూర్, డోంగ్లి రెండు మండలాల పార్టీ కార్యకర్తలు, నాయకులతో నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. కెసిఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కావస్తున్న ఇలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఆయనతో పాటు ఆ పార్టీ మండల అధ్యక్షుడు బన్షి పాటిల్, మద్నూర్ మాజీ సర్పంచ్ సురేష్, మద్నూర్ సహకార సంఘం మాజీ చైర్మన్ విజయ్, నాయకులు గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.