జుక్కల్ మండల కేంద్రంలోని లక్ష్మి ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు అధ్యక్షతన నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వన్ హాజరయ్యారు. కలెక్టర్ ఎమ్మెల్యే చేతుల మీదుగా 925 నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ అని, కొత్త రేషన్ కార్డుల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నిరుపేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఈ రేషన్ కార్డుల వలన సన్న బియ్యంను పొందడమే కాకుండా ప్రభుత్వం అందించే ఏ సంక్షేమ పథకానికైనా ఈ రేషన్ కార్డులు ఎంతో ఉపయోగపడుతాయని ఎమ్మెల్యే అన్నారు. నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజురు అయ్యాయని అన్నారు. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి 35 ఇందిరమ్మ ఇండ్లు జుక్కల్ మండలంలోని బంగారు పల్లి గ్రామంలో ఇండ్లు పూర్తి చేశారని ఆయన తెలిపారు. ఇది కేవలం రేవంత్ రెడ్డి పాలనలో సాధ్యమైందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, హోసింగ్ పీడీ, తహసీల్దార్ మారుతీ, ఎంపీడీఓ శ్రీనివాస్, మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్, సొసైటీ చైర్మన్, నాయకులు కార్యకర్తలు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.