డోంగ్లి మండలం సిర్పూర్ గ్రామం నుంచి పోతాంగల్ మండల కేంద్రానికి వెళ్లే రోడ్డు అక్కడక్కడ అధ్వానంగా మారింది. ఈ మార్గంలో మహారాష్ట్ర సరిహద్దు వద్ద మట్టి రోడ్డు ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షానికే బురద మయంగా మారి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఈ అర కిలోమీటర్ రోడ్డును బాగు చేయాలని కోరుతున్నారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.