Category: నిజాం సాగర్

నిజాంసాగర్​ 15 గేట్లు ఎత్తివేత: మంజీర పరవళ్లు.

నిజాంసాగర్​ ప్రాజెక్ట్​ కు ఎగువ నుంచి భారీగా వరద వస్తుంది. ఇన్​ఫ్లో కొనసాగుతుండడంతో జలాశయం 15 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మంజీర నది పరవళ్లు తొక్కుతోంది. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో మంజీర నదికి…

పొంగి పొర్లుతున్న సింగీతం అలుగు

నిజాంసాగర్​ ప్రాజెక్టు అనుబంధంగా నిర్మించిన సింగితం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు అలుగుపై నుంచి వరద నీరు పొంగిపొర్లుతోంది. సింగితం రిజర్వాయర్ అలుగు పొంగిపొర్లుతుండడంతో మహమ్మద్ నగర్ మండలంలోని తునికిపల్లి గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

నిజాంసాగర్ గేట్ల ఎత్తివేత

భారీ వర్షాలతో నిజాంసాగర్, కౌలాస్ నాల ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఎగువ నుంచి భారీగా ఇన్​ఫ్లో వచ్చి చేరుతోంది. నిజాంసాగర్​ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి 75,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు…

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు: గేట్లు ఎత్తి అవకాశం

నిజాంసాగర్ జలాశయం (ప్రాజెక్టు)లోకి ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. 50వేల క్యూసెక్కులకు పైగా ఇన్​ఫ్లో ప్రాజెక్టులోకి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో అధికారులు మంజీర పరీవాహక ప్రాంతంలో ఉండే ప్రజలను అప్రమత్తం…

నిజాంసాగర్: మాగి శివాలయంలో భక్తుల పూజలు

నిజాంసాగర్ మండలం మాగి గ్రామంలోని శివాలయంలో శ్రావణమాసం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సందడితో ఆలయం ఆధ్యాత్మికంగా వాతావరణం నెలకొంది. భక్తులు కోరుకున్న కోరికలు నెరవేర్చే శివాలయంగా పేరుందని ఆలయ పూజారి తెలిపారు.

నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి విడుదల

వర్షాకాలంలో సాగు చేసిన పంటల కోసం నిజాంసాగర్ ప్రాజెక్ట్​ నుంచి నీటిని విడుదల చేశారు. మంగళవారం సాయంత్రం ప్రాజెక్ట్​ నుంచి 1,200 వందల క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువ ద్వారా విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ ఏఈఈలు సాకేత్, శివప్రసాద్​ తెలిపారు.…

నిజాంసాగర్ లో బైక్ దొంగ అరెస్ట్

ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లిన దొంగను అరెస్ట్ చేసి వాహనం స్వాధీనం చేసుకున్నామని నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ తెలిపారు ఆయన తెలిపిన వివరాలు. మండలంలోని మాగి గ్రామంలో గత నెల 26న కుస్తీ పోటీలు కొనసాగాయి. కుస్తీ పోటీలను తిలకించేందుకు నిజాంసాగర్ మండలంలోని…

చోరీ సొత్తు స్వాధీనం: నిందితుడి అరెస్ట్

చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్ల నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 8న మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో ఓ ఇంట్లో చోరీ…

నిజాంసాగర్ లో జూదదారుల అరెస్ట్

నిజాంసాగర్ లో జూదమాడుతున్న 9 మందిని పోలీసులు పట్టుకున్నారు. సుమారు రూ. 40,990 రూపాయల నగదు, 07 మొబైల్ ఫోన్లు, ఒక కార్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మండలంలో ఎక్కడైనా జూదమాడితే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని… సమాచారం ఇచ్చిన…

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం (జూన్ 2) సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు శాంతియుతంగా పార్లమెంటరీ పంథాలో…