Category: జుక్కల్

ఘనంగా బసవన్నల పండుగ

ఎడ్ల పొలాల అమావాస్య సందర్భంగా ఎద్దుల పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఆయా మండలాలలో ఎద్దులను రంగురంగుల దుస్తులతో ఆలంకరించి గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయాల చుట్టూ తిప్పి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎద్దు, అవులకు పెల్లి చేసి బసవన్నలకు రైతులు పూజలు…

పాఠశాలలకు సెలవు : కలెక్టర్

రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ రోజు జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించామని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) రాజు తెలిపారు.

కౌలాస్ నాల ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత

జుక్కల్ మండలం కౌలాస్​నాల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు. ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో ప్రాజెక్టు నిండిపోయింది. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 29,444 క్యూసెక్కుల ఇన్​ఫ్లో ప్రవహిస్తుండడంతో ప్రాజెక్టు ఐదు వరద గేట్ల ద్వారా 31,350 క్యూసెక్కుల నీటిని దిగువకు…

జుక్కల్ లో జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే

జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు జాతీయ జెండాను ఎగురవేశారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్థానిక మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఆర్ఎంపి, పిఎంపి వైద్యుల సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే

ఆర్.ఎం.పి పి.ఎం.పి వైద్యుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో RMP (రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్), PMP (ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్) సభ్యులు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు…

భక్తులకు తేనేటి విందు: ఎమ్మెల్యే

ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు భక్తులకు తేనేటి విందు ఏర్పాటు చేశారు. జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామం నుంచి ప్రతి ఏటా శ్రావణ మాసంలోని మూడవ మంగళవారం భస్వాపూర్ గ్రామం నుండి మద్నూర్ మండలం సలాబత్ పూర్ (మీర్జాపూర్) హనుమాన్ ఆలయానికి…

జుక్కల్ లో రేషన్ కార్డులను పంపిణీ చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే

జుక్కల్ మండల కేంద్రంలోని లక్ష్మి ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు అధ్యక్షతన నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వన్ హాజరయ్యారు. కలెక్టర్ ఎమ్మెల్యే చేతుల మీదుగా 925 నూతన రేషన్ కార్డులను…

విధుల్లో నిర్లక్ష్యం వహించిన జుక్కల్ ఆసుపత్రి సూపరింటిండెంట్, డ్యూటీ డాక్టర్ కు షోకాష్ నోటీస్:కలెక్టర్

విధులలో నిర్లక్ష్యం వహించిన జుక్కల్ సామాజిక ఆసుపత్రి సూపరింటిండెంట్, డ్యూటీ డాక్టర్ కు షోకాష్ నోటీస్ ఇవ్వాలని డిసిహెచ్ఎస్ ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా జుక్కల్ మండల కేంద్రంలోని సామాజిక ఆస్పత్రిని…

జుక్కల్ శివాలయంలో భక్తుల పూజలు

జుక్కల్ మండల కేంద్రంలోని లిజలింగేశ్వరస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసం రెండవ సోమవారం సందర్భంగా అభిషేకం చేసి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం నుంచే ఆలయానికి భక్తులు బారులు తీరారు వచ్చిన భక్తులకు ఆలయ పూజారి విశ్వనాథ్ ప్రసాద…

మహమ్మదాబాద్ లో పంటల పరిశీలన

జుక్కల్ మండలం మహమ్మదాబాద్ గ్రామ శివారులో మండల వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) సతీష్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి పత్తి, పెసర, సోయా తదితర పంటలను పరిశీలించారు. పత్తి, సోయా పంటలు తెగుళ్లకు గురవుతున్నట్లు గమనించామని, నివారణకు ఎలాంటి మందులు పిచికారీ…