Month: August 2025

సోమూర్ నుంచి భక్తుల పాదయాత్ర

మద్నూర్ మండలం సోమూర్ గ్రామానికి చెందిన పలువురు భక్తులు ఆ గ్రామం నుంచి మండలంలోని సలాబత్ పూర్ ఆంజనేయస్వామి ఆలయానికి పాదయాత్రగా వెళ్లారు. శ్రావణమాసం సందర్భంగా పాదయాత్ర చేసి స్వామి వారిని దర్శించుకున్నామని భక్తులు తెలిపారు. భక్తుల సందడితో హనుమాన్ ఆలయంలో…

ఆర్ఎంపి, పిఎంపి వైద్యుల సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే

ఆర్.ఎం.పి పి.ఎం.పి వైద్యుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో RMP (రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్), PMP (ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్) సభ్యులు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు…

భక్తులకు తేనేటి విందు: ఎమ్మెల్యే

ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు భక్తులకు తేనేటి విందు ఏర్పాటు చేశారు. జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామం నుంచి ప్రతి ఏటా శ్రావణ మాసంలోని మూడవ మంగళవారం భస్వాపూర్ గ్రామం నుండి మద్నూర్ మండలం సలాబత్ పూర్ (మీర్జాపూర్) హనుమాన్ ఆలయానికి…

రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్

బిచ్కుంద మండలం రాజుల్లా , మద్నూర్, పెద్ద కొడప్ గల్ లో లబ్దిదారులకు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి రేషన్ కార్డులు పంపిణీ చేశారు. పలువురు లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ , ముఖ్యమంత్రి…

పెద్ద కొడప్ గల్ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే

పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సందర్శించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ..వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో సమస్యలు, మౌళిక సదుపాయాల…

చిన్న కొడప్ గల్ రామలింగేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే పూజలు

పిట్లం మండలం చిన్న కొడప్ గల్ గ్రామంలో శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణమాసం సందర్భంగా పూజలు చేసినట్లు ఆయన చెప్పారు. పరమ శివుడి ఆశీస్సులతో జుక్కల్ నియోజకవర్గ ప్రజలు పాడి పంటలు,…

తిమ్మ నగర్ పాఠశాలకు బెంచీల వితరణ

పిట్లం మండలం తిమ్మా నగర్ ప్రభుత్వ పాఠశాలకు బెంచీల వితరణ చేశారు. పిట్లం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తిమ్మానగర్ పాఠశాలలో విద్యార్థుల కోసం పది బెంచీలను అందించామన్నారు. తిమ్మానగర్ గ్రామానికి చెందిన పిట్లం లయన్స్ క్లబ్ అధ్యక్షులు, రిటైర్డ్ తహసీల్దార్ నారాయణ…

బిచ్కుంద కేజీబీవీని సందర్శించిన సబ్ కలెక్టర్

బిచ్కుంద మండల కేంద్రంలోని కస్తూరి బాలికల విద్యాలయాన్ని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సందర్శించారు. విద్యార్థుల తరగతి గదులను తిరుగుతూ చదువు అందువు, సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని, భోజనం ఇతర సమస్యలు ఉంటే చెప్పాలని అన్నారు. ఉపాధ్యాయులు…

ఇది ప్రజా ప్రభుత్వం : ఎమ్మెల్యే

ఇది ప్రజా ప్రభుత్వమని ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. డోంగ్లి తహసీల్దార్ కార్యాలయంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమానికి పెద్ద పీఠ వేస్తున్నారని గుర్తు చేశారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా…

జుక్కల్ లో రేషన్ కార్డులను పంపిణీ చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే

జుక్కల్ మండల కేంద్రంలోని లక్ష్మి ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు అధ్యక్షతన నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వన్ హాజరయ్యారు. కలెక్టర్ ఎమ్మెల్యే చేతుల మీదుగా 925 నూతన రేషన్ కార్డులను…