Month: July 2025

నాగల్ గావ్ గ్రామ పంచాయతీని సందర్శించిన ఎంపీవో

జుక్కల్ మండలం నాగల్ గావ్ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని మండల పంచాయతీ అధికారి (ఎంపీవో) రాము సందర్శించారు. పంచాయతీకి సంబంధించిన పలు (దస్రాలు) రికార్డులను పరిశీలించారు. గ్రామంలో సమస్యలను స్థానికులకు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని పారిశుధ్య పనులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఎప్పటికప్పుడు…

జుక్కల్ లో పోలీసు కళాజాత బృందం అవగాహన

జుక్కల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పోలీసు కళాబృందంతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు పోలీస్ కళాబృందం సభ్యులు షి టీమ్, డ్రగ్స్, సైబర్ క్రైమ్…

జుక్కల్ లో గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె నోటీసు

9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో గ్రామ పంచాయతీ కార్మికులందరు పాల్గొంటున్నారని జుక్కల్ మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ కు మండలంలోని పంచాయతీ కార్మికులు సమ్మె నోటీసు అందజేశారు. మండలంలోని వివిధ గ్రామాల గ్రామ పంచాయతీ కార్మికుల ప్రతినిధులతో కలిసి సిఐటియు…

ఫిలిప్పీన్స్ లో డోంగ్లీ మండల వైద్య విద్యార్థి మృతి

పుట్టినరోజు నాడే గుండెపోటుతో మృతి చెందిన విద్యార్థి ఘటన డోంగ్లి మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పిలిప్పీన్స్ దేశంలో డోంగ్లీ మండలం కుర్లా గ్రామానికి చెందిన వైద్య విద్యార్ధి వడ్ల యోగి (23) మృతిచెందాడు.…

మద్నూర్ లో వర్షం

మద్నూర్ తో పాటు పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. సుమారుగా 30 నిమిషాల పాటు వర్షం కురిసింది. దీంతో పలు రోడ్లు జలమయమయ్యాయి. వర్షపు నీరుతో మురుగు కాలువలు నిండిపోయి రోడ్లపై ప్రవహించాయి.

మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె నోటీసు

మద్నూర్ విద్యా వనరుల కేంద్రంలో కార్యాలయ సిబ్బందికి మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మె నోటీసు అందజేశారు. జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో మద్నూర్ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులందరూ ఒక్కరోజు సమ్మెలో…

ఇది రాచూర్ రోడ్డు దుస్థితి సారు…

మద్నూర్ మండలం రాచూరు గ్రామానికి వెళ్లే రోడ్డు బురదమయంగా మారి కాలిబాటను కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి నుంచి గ్రామానికి వెళ్లే మట్టి రోడ్డు చిన్నపాటి వర్షానికే రోడ్డుపై గుంతల్లో వర్షం నీరు…

బంగారు పల్లి లో వైద్య శిబిరం

జుక్కల్ మండలం బంగారు పల్లి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నారని సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు వెంటనే స్పందించి వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఫోన్లో విషయాన్ని చెప్పారు. వెంటనే ప్రత్యేక వైద్య బృందాన్ని…

జుక్కల్ బస్టాండ్ లో బురదలో ఇరుక్కున్న బస్సు

జుక్కల్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఓ ఆర్టీసీ బస్సు బురదలు కూరుకుపోయింది. దీంతో డ్రైవర్ ఎంత సేపు బస్సు ను బయటకు తీసే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. జేసీబీని తీసుకువచ్చి బస్సు వెనుక భాగం నుంచి తోయడంతో…

ఆదర్శ పాఠశాలలో అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

మద్నూర్ మండలం మేనూర్ ఆదర్శ పాఠశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ నర్సా గౌడ్ తెలిపారు. తెలుగు, పొలిటికల్ సైన్స్ బోధించుటకు అర్హులైన ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో పీజీ,…