Month: July 2025

జుక్కల్ లో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

జుక్కల్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో జరుగుతున్న అభివృద్ధి పనులు, మండల కేంద్రంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పరిశీలించారు. పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజా సమస్యలపై ప్రత్యేక…

హంగర్గలో జూదాదారుల అరెస్ట్

జుక్కల్ మండలం హంగర్గ గ్రామంలో జూదం (పేకాట) ఆడతున్న ఐదుగురిని పట్టుకున్నట్లు ఎస్సై నవీన్ చంద్ర తెలిపారు. పక్క సమాచారం మేరకు పట్టుకొని వారి వద్ద నుంచి రూ.1వేయి రూపాయలు నగదుతో పాటు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని వారిపై కేసు…

పెద్ద కొడప్ గల్ ఎస్సైని కలిసిన యువకులు

పెద్ద కొడప్ గల్ కొత్తగా వచ్చిన ఎస్ఐ అరుణ్ కుమార్ ను స్థానిక యువకులు, కాంగ్రెస్ నాయకులు కలిశారు. మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, యువజన నాయకులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం

ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. పిట్లం మండలం చిల్లర్గి గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో చిల్లర్గి గ్రామ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ…

బాన్సువాడ నుంచి తీర్థయాత్రలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం

బాన్సువాడ నుండి వివిధ తీర్థయాత్రలకు స్పెషల్ డీలక్స్ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు డిపో మేనేజర్ సరితా దేవి “మన జుక్కల్ న్యూస్” కు తెలిపారు. జర్హా సంగం మహా దేవుని దర్శనం, బీదర్ నర్సింహా స్వామి, గానుగాపురం దత్తాత్రేయుని దర్శనం, అనంతరం…

రేపు జుక్కల్ నియోజకవర్గంలో మంత్రి పర్యటన

జుక్కల్ నియోజకవర్గంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించనున్నారు. ఆయన పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి 11:40 కి పిట్లం మండలం మద్దెలచెరువు వద్ద హైలెవెల్ వంతెన ప్రారంభోత్సవం. 12:10 బిచ్కుందలో రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.12:30…

బిచ్కుంద లో సబ్ కలెక్టర్ పర్యటన

బిచ్కుంద మండల కేంద్రంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పర్యటించారు. రేపు సోమవారం బిచ్కుంద మండల కేంద్రంలో రోడ్ల పనులకు శంకుస్థాపన చేసేందుకు వస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన నేపథ్యంలో ఆమె ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి కార్యక్రమ వివరాలు, సభ…

ఎమ్మెల్యే కు శుభాకాంక్షలు తెలిపిన మద్నూర్ నాయకులు

ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు జన్మదినం సందర్భంగా మద్నూర్ కు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనకు కలసి శుభాకాంక్షలు తెలిపారు. రాత్రి హైదరాబాద్ లో ఎమ్మెల్యే స్వగృహానికి వెళ్లి పుష్ప గుచ్ఛం ఇచ్చి శాలువాలతో సన్మానం చేశారు. నాయకులు…

మద్నూర్ విఠలేశ్వర ఆలయంలో భక్తుల పూజలు

తొలి ఏకాదశి సందర్భంగా మద్నూర్ లోని విఠలేశ్వర ఆలయంలో భక్తులతో సందడిగా మారింది. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చి పూజలు నిర్వహించారు. తొలి ఏకాదశి రోజున విఠలేశ్వరుని దర్శనం చేసుకుంటే శుభప్రదమని భక్తులు తెలిపారు. పండరీపూర్ లోని ప్రధాన ఆలయానికి…

పిట్లంలో ఆర్ఎస్ఎస్ గురు పూజా కార్యక్రమం

పిట్లం ఆర్ఎస్ఎస్ అధ్వర్యంలో వైశ్య భవన్ లో గురుపూజ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన వక్తగా జిల్లా ప్రచారక్ మీసాల ప్రకాష్ హాజరై ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్ స్థాపించి వంద సంవత్సరాలు ఆయిన సందర్భంగా పంచ పరివర్తన్ కార్యక్రమం వివరించారు. సమాజంలో గురువు ప్రాధాన్యత…