Month: June 2025

గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు

మద్నూర్ మండలంలో ఆయా గ్రామాలలో రెవెన్యూ సదస్సు నిర్వహించినట్లు తాసిల్దార్ ముజీబ్ తెలిపారు. శేఖపూర్ లో 122, చిన్న ఎక్లారా గ్రామంలో 22 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఆయనతో పాటు ఆర్ఐ శంకర్ తదితరులు ఉన్నారు

ఇందిరమ్మ ఇండ్ల పనుల పరిశీలన

పిట్లం గ్రామలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) చందర్ పరిశీలించారు. ఆయనతో పాటు తహశీల్దార్, మండల అభివృద్ధి అధికారి, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు లబ్ధిదారులుతదితరులు ఉన్నారు

ధూప దీప నైవేద్య అర్చక సంఘం

ధూప దీప నైవేద్య అర్చక సంఘం కామారెడ్డి జిల్లా మద్నూర్ మంగళవారం రోజున కామారెడ్డి జిల్లాలోని మద్నూరు మండల కేంద్రం లో రాష్ట్ర ప్రభుత్వ అర్చక సంఘం సంక్షేమం కొరకు అర్చక వెల్ఫేర్ ట్రస్ట్ నుండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు…

ఈదురుగాలులు.

ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో పాటు వర్షం రావడంతో మద్నూర్ మండల వ్యాప్తంగా ఆదివారం రాత్రి పలు చోట్ల చెట్లు విరిగిపోయాయి. చెట్లు విరిగి రహదారులపై పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాత్రి నుంచి విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

సలాబత్ పూర్ ఆలయంలో భక్తుల పూజలు

మద్నూర్ మండలం సలాబత్ పూర్ ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం ఉదయం నుంచే భక్తుల సందడి నెలకొంది. మద్నూర్ మండలం తో పాటు సమీపంలో ఉన్న మహారాష్ట్ర దేగ్లూర్ నుంచి పలువురు భక్తులు కాలిబాటన ఆలయానికి వచ్చి…

మద్నూర్ లో బడిబాట

మద్నూర్ లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట లో భాగంగా ఇంటింటికి తిరుగుతూ విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. పిల్లలను తప్పనిసరి ప్రభుత్వ పాఠశాలకు పంపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం (జూన్ 2) సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు శాంతియుతంగా పార్లమెంటరీ పంథాలో…

బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన కేసిఆర్

బక్రీద్ పండుగ త్యాగం, భక్తి, విశ్వాసానికి ప్రతీక.. మహ్మద్ ప్రవక్త బోధించిన సమైక్యతను, సోదర భావాన్ని అందరూ అనుసరించాలని ఆకాంక్షిస్తూ.. ముస్లిం సోదర, సోదరీమణులందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మాజీ సిఎం కెసిఆర్

జుక్కల్ ఎమ్మెల్యేను పరామర్శించిన పాలకుర్తి ఎమ్మెల్యే

హైదరాబాద్ లోని AIG హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావును GHMC మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ మరియు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్యే గారి ఆరోగ్య…